గూడూరు: రోడ్డు ప్రమాద మృతులకు కేడీసీసీబీ చైర్మన్ నివాళులు

10చూసినవారు
గూడూరు: రోడ్డు ప్రమాద మృతులకు కేడీసీసీబీ చైర్మన్ నివాళులు
కర్నూలు నగరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గూడూరు పట్టణానికి చెందిన చంద్రశేఖర్, నవీన్ మృతదేహాలకు కేడీసీసీబీ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. గాయపడిన సుమన్ ను పరామర్శించి, ధైర్యం చెప్పారు. పోస్టుమార్టం వద్ద మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్