కల్లపరి: అగ్నిప్రమాదంలో పశుగ్రాసం దగ్ధం

14చూసినవారు
కల్లపరి: అగ్నిప్రమాదంలో పశుగ్రాసం దగ్ధం
కోడుమూరు మండలంలోని కల్లపరి గ్రామంలో రైతు వీరేష్ ఇంటి పక్కన ఉన్న కల్లందొడ్డిలో ఆదివారం సుమారు 4 బండ్ల గడ్డివామి అగ్నికి ఆహుతైంది. ఎద్దుల అరుపులు విని నిద్రలేచిన కుటుంబ సభ్యులు వాటిని బయటకు తప్పించి, ఇరుగుపొరుగు వారి సహాయంతో మంటలను అదుపు చేశారు. పశుగ్రాసం పూర్తిగా దగ్ధమైనప్పటికీ, ఎద్దుల ప్రాణాలు కాపాడగలిగారు. ఈ ఆర్థిక నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సహాయం అందించాలని రైతు విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్