కర్నూలులో కీలక రాజకీయ పరిణామం

10చూసినవారు
కర్నూలులో కీలక రాజకీయ పరిణామం
కర్నూలు జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం, కర్నూలు మండల వైసీపీ ఎంపీపీ వెంకటేశ్వరమ్మపై టీడీపీకి చెందిన 13 మంది ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు. వైసీపీలో అభివృద్ధి లేదనే అభిప్రాయంతో ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలు కూడా టీడీపీకి మద్దతు పలికారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందింది. ఈ పరిణామం కేడీసీసీబీ చైర్మన్ డి. విష్ణువర్ధన్‌ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆధ్వర్యంలో జరిగింది.

ట్యాగ్స్ :