కోడుమూరు: దివ్యాంగులకు ఇంటి స్థలాలు మంజూరు చేయించాలని వినతి

3చూసినవారు
కోడుమూరు: దివ్యాంగులకు ఇంటి స్థలాలు మంజూరు చేయించాలని వినతి
కోడుమూరు మండలంలోని దివ్యాంగులకు ఇంటి స్థలాలు ఇప్పించాలని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బి. సురేష్ నాయుడు, మండల అధ్యక్షుడు ఎం. రాజశేఖర్, కార్యదర్శి రుబీనా మంగళవారం కర్నూలులో కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరగా, ఇళ్ళు, భూముల కేటాయింపు కోసం కలెక్టర్ తో చర్చించి సమస్య పరిష్కరిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దివ్యాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. ఎల్లప్ప, టౌన్ టీడీపీ అధ్యక్షుడు గంగాధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్