విజయవాడలో అంగన్వాడీలు శాంతియుతంగా ధర్నా చేస్తున్న సమయంలో అర్ధరాత్రి అమానుషంగా అరెస్టు చేయడం దారుణమని కోడుమూరు సీఐటియు మండల అధ్యక్షులు వీరన్న తెలిపారు. మంగళవారం కోడుమూరులో అంగన్వాడీల అరెస్టులను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. వారిని అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో గఫూర్, బుడ్డప్ప, ప్రాజెక్టు నాయకులూ సూలమ్మ, రజియా, తదితర అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.