కోడుమూరు: ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

1073చూసినవారు
కోడుమూరు: ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
కోడుమూరు మండలం కొత్తూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం కోడుమూరు బీఎస్ఎన్ఎల్ లో పనిచేస్తున్న దాయరామ గోవింద్ ఆయన భార్యతో కలిసి బైక్ పై కర్నూలు నుంచి కోడుమూరుకు వస్తుండగా, ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో భార్య, భర్తలు స్పాట్ లోనే మృత్యువాత పడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని పరిశీలించి, మృతదేహాలను కోడుమూరుకు తరలించారు.

సంబంధిత పోస్ట్