గురువారం కోడుమూరులో నిర్మాణంలో ఉన్న ధర్మపురి క్షేత్ర శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి ఆదిమూలపు సతీష్ సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు సుధీర్ శాస్త్రి ఆధ్వర్యంలో వారికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటడం, అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడుమూరు భవిష్యత్తులో ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని వారు తెలిపారు.