ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం కోడుమూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గుడె మాధవస్వామి, ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి రాముడు పాల్గొని, చేనేత కార్మికులకు పెన్షన్, రూ. 36,000 భరోసా, స్థలంలేని వారికి వర్క్‌షెడ్లు, సిల్క్ రాయితీ, భీమా, యార్న్ సబ్సిడీ, జీఎస్టీ రద్దు, ముద్ర రుణాలపై సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు.