కోడుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం సెట్కూరు ఆధ్వర్యంలో మత్తుపదార్థాలు, డ్రగ్స్ వినియోగం, సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సెట్కూరు సీఈఓ డా. కె. వేణుగోపాల్ మాట్లాడుతూ, డ్రగ్స్ వినియోగం వల్ల యువత భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరించారు. ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ యం. మంజుల, జె. లక్ష్మి, ప్రిన్సిపాల్ షైక్షావలి కూడా యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.