టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకేపోగు ప్రభాకర్ మాట్లాడుతూ, డీఎస్సీ-2025ను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ నిర్వహించి 16,347 ఉద్యోగాలను భర్తీ చేశామని, స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లను పబ్లిక్ డొమైన్‌లో ఉంచామని, అనుమానాలుంటే పరిశీలించవచ్చని చెప్పారు. డీఎస్సీని అడ్డుకునేందుకు 240 కేసులు వేసినా ప్రభుత్వం వెనుకడుగు వేయలేదని పేర్కొన్నారు. ఈ ప్రకటన బుధవారం కర్నూలులోని
టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగింది.