కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక నల్ల చట్టాలను రద్దు చేయాలని యువజన సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. శుక్రవారం కోడుమూరులోని సుందరయ్య భవన్‌లో సిఐటియు మండల కార్యదర్శి గఫర్ మియా అధ్యక్షతన 140వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్లా, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకుడు సలీం, సిపిఎం మండల కార్యదర్శి కే రాజు, పార్టీ సీనియర్ నాయకులు టివిరన్న, కే కరీం భాషా తదితరులు పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి నివాళులర్పించి, మేడే జెండాను ఆవిష్కరించారు.