విద్యుత్ శాఖలో వాచ్‌మన్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, రూ. 1.50 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు. మిడుతూరు మండలం రోళ్ళపాడు గ్రామానికి చెందిన శివుడు, కోడుమూరుకు చెందిన వీరేష్ పై ఈ ఆరోపణలు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్న వీరేష్, డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తాన్ని సమకూర్చేందుకు బంగారం తాకట్టు పెట్టి అప్పు తీసుకుని ఇచ్చినట్లు తెలిపారు.