రహదారి ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. కోడుమూరులో ఎస్సై ఎర్రిస్వామి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని, హెల్మెట్ వినియోగం, ఓవర్ స్పీడ్, మైనర్ల వాహనాల నిషేధంపై అవగాహన కల్పించాలని సూచించారు.