హిందూ దేవుళ్లను అవమానించేలా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిపై బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోమవారం కోడుమూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ సంఘాల నాయకుల ఫిర్యాదు మేరకు ఎస్సై ఎర్రిస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నిరసనలో ఉరుకుంద యాదవ్, వీరేంద్ర, తాయప్ప, మహేష్ నాయుడు, నాగేశ్వరరావు, కిరణ్, జీతూరి రవి తదితరులు పాల్గొన్నారు.