రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జనవరి 3న కోడుమూరు మండల కేంద్రానికి రానున్నారు. ఉల్లి పంట నష్టపోయిన రైతులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే నేపథ్యంలో, కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులతో కలిసి సభ వేదిక స్థలాన్ని పరిశీలించారు. స్టాల్స్, తాగునీటి, భోజన సదుపాయాలు, సౌండ్ సిస్టం, వాహన పార్కింగ్ వంటి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని, వివిధ శాఖల సమన్వయం ఉండేలా చూడాలని ఆదేశించారు.