కోడుమూరు: రైతులకు పెరిగిన రసాయన ఎరువుల ధరలు తగ్గించాలి

2చూసినవారు
కోడుమూరు: రైతులకు పెరిగిన రసాయన ఎరువుల ధరలు తగ్గించాలి
రసాయన ఎరువుల ధరలు పెరగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ధరలు తగ్గించాలని సీపీఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం కోడుమూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. రాజు, రైతు సంఘం మండల కార్యదర్శి కొళాయిల రాముడు, మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు సులోచనమ్మ మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్