కోడుమూరు: కూటమి వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ నిరసన

0చూసినవారు
కోడుమూరు: కూటమి వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ నిరసన
కోడుమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో బుధవారం వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్, బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమై ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్