కర్నూలు: ఎయిడ్స్ పై ప్రజల్లో అవగాహన పెంచి, అపోహలు తొలగించాలి

8చూసినవారు
కర్నూలు: ఎయిడ్స్ పై ప్రజల్లో అవగాహన పెంచి, అపోహలు తొలగించాలి
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచడం, అపోహలు తొలగించడం అత్యవసరమని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి అన్నారు. సోమవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ బాధితులపై వివక్ష కొనసాగుతోందని, వారి మానసిక ఆరోగ్యానికి కౌన్సిలింగ్ కీలకమని చెప్పారు. హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణ, నియంత్రణ చట్టం–2017 ప్రకారం ఉద్యోగం, విద్య, వైద్యం, నివాసంలో వివక్ష చట్ట విరుద్ధమని, టోల్‌ఫ్రీ 15100 ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :