కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో, స్కూల్, కళాశాలల్లో అడ్మిషన్ల సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. ప్రముఖ విద్యాసంస్థల ప్రతినిధులమంటూ ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా సీట్లు రిజర్వ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు ఫీజులను అధికారిక వెబ్‌సైట్ లేదా కార్యాలయం ద్వారా మాత్రమే చెల్లించాలని, అనుమానాస్పద ఖాతాలు, యూపీఐ ఐడీలకు డబ్బులు పంపవద్దని సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని తెలిపారు.