కర్నూలు: చైన్ స్నాచింగ్ చేసిన మహిళా దొంగ అరెస్టు

11చూసినవారు
కర్నూలు: చైన్ స్నాచింగ్ చేసిన మహిళా దొంగ అరెస్టు
కర్నూలులో బుర్ఖా ధరించి, కత్తితో బెదిరించి గొలుసు దొంగిలించిన మహిళా దొంగ యాస్మిన్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ధనలక్ష్మినగర్‌కు చెందిన దేవమ్మ మెడలోని గొలుసును యాస్మిన్ లాక్కెళ్లింది. పోలీసులు ఆమె వద్ద తులం బంగారు గొలుసు, కత్తి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ భారంతో ఈ నేరానికి పాల్పడినట్లు యాస్మిన్ అంగీకరించింది. కోర్టు ఆమెను 15 రోజుల రిమాండ్‌కు ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్