కర్నూలు: నిర్మాణ కార్మికులకు నాలుగు సంక్షేమ పథకాల పునరుద్ధరణ

4చూసినవారు
కర్నూలు: నిర్మాణ కార్మికులకు నాలుగు సంక్షేమ పథకాల పునరుద్ధరణ
భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కీలక పథకాలను పునరుద్ధరించింది. మార్చి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకాల ద్వారా వివాహ కానుకగా రూ. 20,000, ప్రసూతి సహాయంగా రూ. 20,000, సహజ మరణానికి రూ. 60,000, అంత్యక్రియల ఖర్చులకు రూ. 20,000 ఆర్థిక సహాయం అందజేయబడుతుందని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.