కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించాలని సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, కష్టాలు ఎదురైనా చదువును మధ్యలో ఆపకూడదని, డిగ్రీ, పీజీ వరకు కొనసాగించాలని తెలిపారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించుకోవాలని, మొబైల్ ఫోన్‌ను సానుకూల సమాచారానికి మాత్రమే ఉపయోగించాలని విద్యార్థులకు సూచించారు.