ఆంధ్రప్రదేశ్‌లో
వైసీపీ పాలన మొదలై రెండేళ్లు పూర్తైన సందర్భంగా
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకేపోగు ప్రభాకర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కర్నూలు జిల్లా
టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ,
వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు వంటి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు.