కర్నూలు: డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్‌కు సిద్ధం

కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి జి. కబర్థి సూచనల మేరకు కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో సోమవారం ఎక్సైజ్ అధికారులతో సమావేశం జరిగింది. డిసెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్ క్రిమినల్, ఎక్సైజ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
