కర్నూలు: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

4చూసినవారు
కర్నూలు: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
కర్నూలు–దూపాడు రైలుమార్గంలో కార్బైడ్ ఫ్యాక్టరీ సమీపంలో శుక్రవారం ఒక గుర్తుతెలియని వ్యక్తి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమాదంలో మృతదేహం తీవ్రంగా ఛిద్రమై గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మృతుడి వయసు సుమారు 45 ఏళ్లు ఉండవచ్చని, తెలుపు గీతల షర్టు, నీలం రంగు లోయర్, తెలుపు కట్ బనియన్, నలుపు కట్ డ్రాయర్ ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఎడమ మోచేతిపై "ఎంఎస్కే" అనే ఇంగ్లిష్ అక్షరాలు ఉన్నాయని, మృతుడి ఆచూకీ తెలిసినవారు 9247575608, 9247575609 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కర్నూలు రైల్వే పీఎస్ సీఐ శ్రీనాథ్ రెడ్డి కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్