కర్నూలు: అవినీతి ఆరోపణలపై యూనివర్సిటీ ఆందోళన

12చూసినవారు
కర్నూలు: అవినీతి ఆరోపణలపై యూనివర్సిటీ ఆందోళన
కర్నూలు జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి, నిధుల దుర్వినియోగంపై విద్యార్థి సంఘాలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశాయి. పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎ, ఏఐఎస్ఎఫ్, ఆర్‌పీఎస్‌ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులు యూనివర్సిటీ పరిపాలన భవనాన్ని ముట్టడించి, రిజిస్ట్రార్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి నిధులను దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయల నష్టం కలిగించారని వారు ఆరోపించారు.

ట్యాగ్స్ :