కోడుమూరు నియోజకవర్గంలో
టీడీపీ మహానాడు రెండో రోజు కార్యక్రమం పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగింది. కర్నూలు డీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గులు దస్తగిరి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బి. సురేష్ నాయుడు ఆధ్వర్యంలో కోడుమూరు మండలంలోని దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.