పులకుర్తిలో రేపు వన్ మంత్ - వన్ విలేజ్’ కార్యక్రమం ప్రారంభం

3చూసినవారు
పులకుర్తిలో రేపు వన్ మంత్ - వన్ విలేజ్’ కార్యక్రమం ప్రారంభం
గ్రామస్థాయి రెవెన్యూ సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం "వన్ మంత్ - వన్ విలేజ్" కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా, కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో గురువారం నుంచి పీజీఆర్‌ఎస్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని తహసీల్దార్ నాగరాజు తెలిపారు. ప్రతి గురువారం గ్రామాన్ని సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారు. మొదటి వారంలో అసైన్డ్ భూములు, సెక్షన్ 22-ఏ కింద నిషేధిత భూములు, చెరువులు, నీటి వనరుల భూముల జాబితాలను ప్రదర్శించడంతో పాటు, గృహ స్థలాలు, ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన భూముల వివరాలను ప్రజలకు తెలియజేస్తారు.

సంబంధిత పోస్ట్