పెంచికలపాడులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం

5చూసినవారు
పెంచికలపాడులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం
గూడూరు మండలం పెంచికలపాడు గ్రామంలో శుక్రవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకట రాముడు, ఎంపిటిసి మదిలేటి, టిడిపి సీనియర్ నాయకుడు కర్ణం చిన్న గిడ్డయ్య, నాయకులు నగేష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు తిప్పన్న, కర్ణం యుగంధర్, బ్రహ్మయ్య, వీఆర్వో కృష్ణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరంతా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్