ఎన్టీఆర్ భరోసా పథకం కింద కర్నూలు జిల్లాలో 2,37,904 మంది లబ్ధిదారులకు రూ.103.82 కోట్ల పెన్షన్లు పంపిణీ చేసినట్లు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. శనివారం కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కలెక్టర్, ఎంపీ బస్తిపాటి నాగరాజు పెన్షన్లు అందజేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు.