కోడుమూరులో పెట్రోల్ కొరత – బంకుల వద్ద వాహనాల బారులు

7చూసినవారు
కోడుమూరులో పెట్రోల్ కొరత – బంకుల వద్ద వాహనాల బారులు
కోడుమూరు పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. ఆదివారం పట్టణంలోని ఐదు పెట్రోల్ బంకుల్లో ఒకేచోట ఇంధనం అందుబాటులో ఉండటంతో వాహనాల రద్దీ నెలకొంది. రైతులు, జేసీబీ వాహనదారులు, ప్రజలు గంటల తరబడి వేచిచూశారు. క్యాన్లు, ప్లాస్టిక్ బాటిళ్లలో ఇంధనం పోయరాదన్న నిబంధనలతో బంకు యాజమాన్యానికి, వినియోగదారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్