కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సోమవారం కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో పర్యటించి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఆయన ప్రతి ఇంటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులు, లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. గ్రామంలో 3 కొత్త వితంతు పెన్షన్లు, నియోజకవర్గంలో మొత్తం 37 వితంతు పెన్షన్లు మంజూరు అయినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తోందని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన సంక్షేమ హామీలు అమలవుతున్నాయని ఆయన అన్నారు.