గూడూరు మండలంలోని పొన్నకల్లులో అగ్నికి ఆహుతైన గడ్డివాములను మంగళవారం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పరిశీలించారు. రాజకీయ కక్షతోనే తమ గడ్డివాములకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని బాధితులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎంపీ, ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో రాజకీయ కక్షలు, విద్వేషాలకు పాల్పడితే సహించేది లేదని, కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలు, దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించదని ఆయన స్పష్టం చేశారు.