శనివారం రాత్రి గూడూరు మండలం పొన్నకల్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన కురువ లింగన్న, ముడుమాల గ్రామానికి చెందిన కురువ మద్దిలేటి ఒకే బైక్‌పై వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో వారికి బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.