కోడుమూరు సీపీఐ సీనియర్ నేత కన్నుమూత

5చూసినవారు
కోడుమూరు సీపీఐ సీనియర్ నేత కన్నుమూత
కోడుమూరుకు చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ MPTC, APSRTC డ్రైవర్ మునిస్వామి అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రజా ఉద్యమాలు, కార్మిక హక్కుల కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని పార్టీ నేతలు, సహచరులు గుర్తుచేసుకున్నారు. మునిస్వామి మృతి కోడుమూరు ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.