కర్నూలు జిల్లాలో పరిశ్రమల అనుమతులకు వేగం పెంచాలి

8చూసినవారు
కర్నూలు జిల్లాలో పరిశ్రమల అనుమతులకు వేగం పెంచాలి
కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జిల్లాలో పరిశ్రమల స్థాపనకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో, సింగిల్ డెస్క్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని సూచించారు. ఎంఓయూ పరిశ్రమల స్థాపన, పీఎం విశ్వకర్మ, పీఎంఈజిపి పథకాల కింద రుణాల మంజూరును వేగవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ, బ్యాంకులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్