గూడూరు మండలం పెంచికలపాడు గ్రామంలో ఆదివారం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు. ఈ సందర్భంగా అభిషేకం, కల్యాణం, అన్నదానం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు, స్వామివారి ప్రభను ఊరేగించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, గ్రామ పెద్దలు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని భక్తులు కోరారు.