రాయలసీమ వర్సిటీలో వేటకొడవలితో విద్యార్థి హల్‌‌‌చల్

0చూసినవారు
రాయలసీమ వర్సిటీలో వేటకొడవలితో విద్యార్థి హల్‌‌‌చల్
రాయలసీమ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులైన అజయ్ నాయక్, బాలాజీ నాయక్ మధ్య సెల్‌ఫోన్ వివాదం ఘర్షణకు దారితీసింది. శుక్రవారం, అజయ్ నాయక్ వేటకొడవలితో బాలాజీ నాయక్ గది వద్ద హల్‌చల్ చేయడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి అజయ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్