మంగళవారం అనుగొండ సచివాలయాన్ని ఎంపీడీవో రాముడు సందర్శించి, గ్రామ పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని సూచించారు. ఐవిఆర్ఎస్ కాల్స్‌లో తక్కువ శాతం నమోదవుతున్న నేపథ్యంలో, ప్రజల్లో అవగాహన పెంచి పాజిటివ్ శాతం పెంచాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, మిస్సింగ్ డేటా ఈ-కేవైసీ, సెన్సెస్ సెల్ఫ్ ఎనుమరేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు.