కర్నూలు వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పంటల ధరలు ఆశాజనకంగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఎండుమిర్చి క్వింటా గరిష్ఠంగా రూ. 19,377కు చేరగా, వాము రూ. 22,240, వేరుసెనగకాయలు రూ. 7,391, పొద్దుతిరుగుడు విత్తనాలు రూ. 6,229, ఆముదాలు రూ. 6,050, మొక్కజొన్నలు రూ. 1,800, కందులు రూ. 7,509, కందుల వడకలు రూ. 3,460, కొర్రలు రూ. 2,139 ధరలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్లో పంటలకు మంచి డిమాండ్ ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.