కర్నూలులో నేటి నుంచి మూడు రోజుల విజ్ఞాన వారోత్సవాలు ప్రారంభం

4చూసినవారు
కర్నూలులో నేటి నుంచి మూడు రోజుల విజ్ఞాన వారోత్సవాలు ప్రారంభం
కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో బుధవారం నుంచి మూడు రోజుల పాటు విజ్ఞాన వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ మంగళవారం తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత పెంపొందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలో 4-5 తేదీల్లో మండల కేంద్రాల్లో, 6న జిల్లాస్థాయి కార్యక్రమాలు ఐఏఎస్ఈ కాలేజీలో జరుగుతాయి. సందేహాల నివృత్తికి జిల్లా సైన్స్ అధికారిని 87901 11331లో సంప్రదించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్