May 05, 2026, 07:05 IST/
మారిన పోస్టాఫీసు రూల్స్.. ఇకపై పాన్ తప్పనిసరి
May 05, 2026, 07:05 IST
పోస్టాఫీసు లావాదేవీలలో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇండియా పోస్ట్ జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం, డిపాజిట్లు, విత్డ్రాయల్స్ సహా అన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరిగా మారింది. కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు–2026 ప్రకారం ఖాతా ఉన్నా లేకపోయినా, అలాగే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు వినియోగించినా పాన్ అవసరం. పన్ను ఎగవేత నియంత్రణ, పారదర్శకత పెంపే లక్ష్యంగా ఇండియా పోస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. పాన్ లేనివారు ఫారం 60 స్థానంలో ఫారం 97 సమర్పించాల్సి ఉంటుంది.