కర్నూలులో 15 జెసిబిలతో 2వ విడత స్పెషల్ డ్రైవ్

5చూసినవారు
కర్నూలులో 15 జెసిబిలతో 2వ విడత స్పెషల్ డ్రైవ్
కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ మాట్లాడుతూ, నగర పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం సాధ్యమని తెలిపారు. ఆదివారం నగర వ్యాప్తంగా 250కి పైగా ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపునకు 15 జెసిబిలతో 2వ విడత స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బళ్లారి చౌరస్తాలో డ్రైవ్‌ను ప్రారంభించి షరీన్‌నగర్, వెంకటరమణ కాలనీ ప్రాంతాల్లో శుభ్రత పనులను పరిశీలించారు. ఖాళీ స్థలాల యజమానులు పరిశుభ్రత పాటించకపోతే నోటీసులు, జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్