కర్నూలు జిల్లాలోని KGBVల్లో 78 ఖాళీ పోస్టుల భర్తీకి ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌కు శుక్రవారం సాయంత్రానికి సుమారు 4500 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. రేపటి వరకు దరఖాస్తు గడువు ఉండటంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే, మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి.