కర్నూలు జిల్లాలో 2025లో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఏడాది 547 ప్రమాదాలు జరగగా, ఈ ఏడాది 658కి చేరింది. చిన్న టేకూరులో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది, సంతోష్‌నగర్‌లో జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.