కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు 75 ఏళ్ల సుబ్బ లక్ష్మమ్మ అనే వృద్ధురాలి కడుపు నుండి 10 కిలోల అండాశయ కనితిని విజయవంతంగా తొలగించి వైద్య రంగంలో తమ సామర్థ్యాన్ని నిరూపించారు. ఆరు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను మే 1న వైద్యుల బృందం అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి, 30 x 25 సెం.మీ. పరిమాణంలో ఉన్న గడ్డను తొలగించింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ విజయం పట్ల క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ వైద్య బృందాన్ని అభినందించారు.