కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి ఆనంద్ పై దాడి జరిగింది. తన మిత్రులతో కలిసి అతను అద్దె గదిలో ఉంటున్నాడు. పక్క గదిలో యూట్యూబ్ కెమెరామెన్ గా పనిచేసే అతను మరొకరితో కలిసి మద్యం సేవించి, విద్యార్థులతో దుర్భాషలాడి దాడికి పాల్పడగా వారు అడ్డుకున్నారు. బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 3 టౌన్ సీఐకి ఈ ఘటనపై ఫిర్యాదు అందింది.