నంద్యాలలో హోలీక్రాస్ పార్ట్లీ ఎయిడెడ్ గర్ల్స్ హైస్కూల్ లో 1 నుండి 7 తరగతుల వరకు ప్రభుత్వ ఎయిడెడ్ గా, 8, 9, 10 తరగతులు ప్రైవేట్ ఎయిడెడ్ గా నడుపుకొనుటకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. అయితే, నియమ నిబంధనలకు విరుద్ధంగా హెచ్.ఎం. శ్రీమతి మంజరివుడ్ తన యాజమాన్యానికి అక్రమంగా సహకరిస్తూ ప్రభుత్వ విద్యాశాఖను మోసం చేస్తున్నారని బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు కె. సతీష్ కుమార్ ఆరోపించారు. అర్హత లేకున్నా హెచ్.ఎం. గా వ్యవహరిస్తూ, 10వ తరగతి నామినల్ రోల్ పై సంతకాలు చేస్తూ నేరానికి పాల్పడ్డారని, విద్యాశాఖాధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, పాఠశాల రికార్డుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఆర్జేడి, డిఈఓ, డిప్యూటి ఈఓ లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.