కర్నూలు నగరంలోని చెన్నమ్మ సర్కిల్ సమీప జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ట్రాక్టర్ను ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.