పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల సీజన్‌ను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని SP విక్రాంత్ పాటిల్ బుధవారం హెచ్చరించారు. సీట్లు రిజర్వేషన్ చేస్తామంటూ ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా అడ్వాన్స్ ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాసంస్థల అధికారిక కార్యాలయాలు లేదా గుర్తింపు పొందిన వెబ్‌సైట్ల ద్వారానే ఫీజులు చెల్లించాలని సూచించారు. ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచనలు జారీ చేశారు.